Shahrukh Khan: వెయ్యి కోట్ల మార్క్ కి చేరువలో 'జవాన్'

Jawan Movie Update

  • ఈ నెల 7వ తేదీన విడుదలైన 'జవాన్'
  • ద్విపాత్రాభినయం చేసిన షారుక్ 
  • ఇంతవరకూ 953.97 కోట్ల వసూళ్లు
  • ఖుషీ అవుతున్న షారుక్ ఫ్యాన్స్

షారుక్ ఖాన్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో 'జవాన్' సినిమా రూపొందింది. షారుక్ సునీత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. ఈ నెల 7వ తేదీన హిందీ .. తమిళ .. తెలుగు భాషల్లో విడుదలైంది. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.

ఈ సినిమా ఇంతవరకూ 953.97 కోట్లను వసూలు చేసింది. వెయ్యికోట్ల మార్క్ ను టచ్ చేయడానికి చేరువలో ఉంది. చాలా వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఇది ఒకటిగా చేరింది. షారుక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, దీపికా పదుకొణె ... నయనతార .. విజయ్ సేతుపతి .. ప్రియమణి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

అట్లీ తయారు చేసుకున్న కథాకథనాలు .. ప్రధానమైన పాత్రలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు .. అనిరుధ్ అందించిన సంగీతం .. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయని అంటున్నారు. షారుక్ కి 'పఠాన్' తరువాత ఈ స్థాయి హిట్ పడటం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Shahrukh Khan
Deepika Padukone
Nayanatara
Jawan
  • Loading...

More Telugu News