Vijayasai Reddy: ఏ నేరం చేయకపోతే నిర్దోషిగా బయటికి వస్తారు కదా!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Chandrababu issue

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య మరింత ముదిరిన మాటల యుద్ధం
  • చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగం చెబుతోందన్న విజయసాయి

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ లో స్పందించారు. ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబుకు ఇబ్బంది ఏముంటుందని వ్యాఖ్యానించారు. 

"చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరికీ మినహాయింపులు ఉండవని రాజ్యాంగం విస్పష్టంగా పేర్కొంది. కానీ, 74 ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వంలో ఏదో జరిగితే ఆయనకేం సంబంధం? అని వింత వాదనలు చేస్తున్నవారు న్యాయస్థానం నిర్ణయాన్ని తప్పుబట్టే సాహసం చేస్తున్నారు. ఏ నేరం చేయకపోతే నిర్దోషిగా బయటికి వస్తారు కదా!" అని విజయసాయి పేర్కొన్నారు.

Vijayasai Reddy
Chandrababu
Arrest
YSRCP
TDP
  • Loading...

More Telugu News