చంద్రబాబు దోపిడీ గురించి టీడీపీ ఎమ్మెల్యేలకూ తెలుసు కానీ...: బొత్స
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే టీడీపీ పారిపోతోందన్న బొత్స
- అవినీతి, అక్రమాలు ఎలా జరిగాయో వివరించామని వెల్లడి
- టీడీపీ కూడా అసెంబ్లీ వేదికగా ఏదైనా చెప్పాలని సూచన
- చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్కదారి పడతాయని నిలదీత
- తప్పు చేశారు కాబట్టే క్వాష్ పిటిషన్ కొట్టివేశారని వ్యాఖ్య
చంద్రబాబు దోపిడీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. టీడీపీ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసునని, కానీ కావాలనే సభలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్కదారి పడతాయన్నారు. ఏయే షెల్ కంపెనీల ద్వారా డబ్బులు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గుతేల్చిందన్నారు.
రెండు రోజులుగా టీడీపీ సభాసమయాన్ని వృథా చేస్తోందన్నారు. సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. చర్చలో పాల్గొంటే స్కాం చేసినట్లు దొరికిపోతామని టీడీపీ భయపడుతోందన్నారు. వారు తప్పు చేశారు కాబట్టే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేసిందన్నారు. సీమెన్స్‌తో ప్రభుత్వం ఒప్పందం అంటున్నారని, మరి ఆ నిధులు ఎక్కడకు వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు.