Chandrababu: చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు

ACB Court gives Chadrababu to CID custody

  • రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
  • కస్టడీ తేదీలను తర్వాత ప్రకటిస్తామన్న కోర్టు
  • రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును విచారిస్తామన్న సీఐడీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లబోతున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరింది. అయితే, ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఇంకోవైపు, చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. మరోవైపు రెండు రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ ను కూడా కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే.

Chandrababu
Telugudesam
CID
Custody
ACB Court
  • Loading...

More Telugu News