Jayalalitha: అతని కోసం 100 సినిమాలు వదిలేసుకుని ఉంటాను: నటి జయలలిత

Jayalalitha Interview

  • తన వైవాహిక జీవితాన్ని ప్రస్తావించిన జయలలిత 
  • తన భర్త తన డబ్బు .. నగలు లాగేసుకున్నాడని వెల్లడి 
  • చిత్రహింసలు పెట్టేవాడిని వ్యాఖ్య 
  • ఏడేళ్ల ప్రేమకి ఏడు నెలల్లో తెరపడిందని వివరణ 

జయలలిత .. అప్పట్లో ఒక గ్లామరస్ హీరోయిన్ కి ఉండవలసిన లక్షణాలు ఆమెలో పుష్కలంగా ఉండేవి. కొన్ని సినిమాల్లో మంచి వేషాలు పడినప్పటికీ, ఆ తరువాత ఆమె వ్యాంప్ గానే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. కెరియర్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలోనే ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగకపోవడం బాధాకరం. 

తాజాగా ఫిల్మ్ ట్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ .. "రోజుకి మూడు షిఫ్టులు పనిచేస్తున్న సమయంలోనే నాకు ఒక సమస్య ఎదురైంది. ఆ సమయంలో ఆ వ్యక్తి నాకు అండగా నిలిచాడు. అప్పుడు ఆయన నాకు ఒక హీరోలా కనిపించడంతో ప్రేమలో పడ్డాను. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నాము. ఆయన ప్రేమలో పడి దాదాపు 100 సినిమాలు వదిలేసుకుని ఉంటాను" అని అన్నారు. 

"పెళ్లి జరిగిన తరువాత కాపురానికి వెళ్లాను. ఒక నెల రోజులపాటు బాగానే ఉన్నాడు .. ఆ తరువాత నుంచి అసలు కథ మొదలైంది. అప్పులవాళ్లు ఇంటిపైకి వచ్చేవారు. నా దగ్గరున్న డబ్బులు .. నగలు తీసుకుని వాళ్లకి ఇచ్చేసేవాడు. నా దగ్గరున్న డబ్బు అయిపోగానే చిత్రహింసలు పెట్టేవాడు. చివరికి ఒక రోజున నన్ను గదిలో బంధించాడు .. సన్నిహితుల కారణంగా అక్కడి నుంచి బయటపడ్డాను. ఏడేళ్ల ప్రేమకి ఏడు నెలలు తిరగకముందే తెరపడిపోయింది" అంటూ వివరించింది. 

Jayalalitha
Actress
Tollywood
  • Loading...

More Telugu News