Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
- అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని సీఐడీ కేసు
- ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు
- ఈనెల 26కు విచారణను వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను 26న వింటామని హైకోర్టు తెలిపింది.
కేసు వివరాల్లోకి వెళ్తే... రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపించింది. టీడీపీ ప్రభుత్వం చేబట్టిన రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా అలైన్ మెంట్ మార్చారని ఆరోపించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.