Sikhs for Justice: హిందువుల్లారా కెనడా నుంచి వెళ్లిపోండి: సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం

Sikhs for Justice asks Hindus of Indian origin to leave Canada

  • భారత్ వాదనకు మద్దతుగా నిలిచేందుకు వెళ్లిపోండంటూ హెచ్చరిక
  • నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకునేందుకు అంటూ ప్రకటన
  • ఖలిస్థాన్ అనుకూల వాణిని అణచివేస్తున్నట్టు ఆరోపణలు

కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అల్టిమేటం జారీ చేసింది. ఈ సంస్థను 2019 లో భారత సర్కారు నిషేధించింది. ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకునేందుకు, ఈ విషయంలో భారత్ వాదనకు మద్దతుగా నిలిచేందుకు భారత సంతతికి చెందిన హిందువులు కెనడాను వీడాలని ప్రకటన విడుదల చేసింది.

‘‘ఇండో-హిందూ కెనడాను వీడండి. భారత్ కు వెళ్లిపోండి. భారత్ కు మీరు మద్దతుగా నిలవడమే కాదు, ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ ప్రకటన వ్యక్తీకరణ అణచివేతకు సైతం మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ ఎస్ఎఫ్ జే లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ ఓ వీడియో మెస్సేజ్ ను విడుదల చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. పన్నమ్ ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించడం గమనార్హం. ఈ హెచ్చరికపై కెనడియన్ హిందూస్ ఫర్ హార్మనీ సంస్థ అధికార ప్రతినిధి విజయ్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు హిందూఫోబియాను కెనడా అంతటా పెద్ద ఎత్తున చూస్తున్నట్టు చెప్పారు.

More Telugu News