Sonia Gandhi: మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం: హైదరాబాద్ సభలో సోనియా ప్రకటన

Sonia announces poll guarantees

  • హైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభ
  • హాజరైన సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీల ప్రకటన

హైదరాబాదులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరైన పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని సోనియా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు. 

ఇక, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. కౌలు రైతులు సహా ప్రతి పట్టా భూమి రైతుకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని వివరించారు. వరి ధాన్యం క్వింటాల్ పై అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు.

Sonia Gandhi
Congress
Poll Guarantees
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News