Congress: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో పోస్టర్ల కలకలం
![Congress against sonia and rahul with revanth reddy pics](https://imgd.ap7am.com/thumbnail/cr-20230917tn6506be260ba6b.jpg)
- బంజారాహిల్స్‌లో వెలిసిన వాల్ పోస్టర్లు
- సీడబ్ల్యూసీ భేటీ సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక పోస్టర్లు
- తాజ్‌కృష్ణలో కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు
హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల్లు జరగనున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీకి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.
![](https://img.ap7am.com/froala-uploads/20230917fr6506be1a27c24.jpg)