Visa: సందర్శకులు, విద్యార్థులకు వీసా ఫీజు పెంచిన బ్రిటన్

Britain hikes Visa fee

  • వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ సర్కారు
  • సందర్శకుల వీసాపై రూ.1,543 పెంపు
  • విద్యార్థి వీసాపై రూ.13,070 పెంపు
  • పెంచిన వీసా ఫీజులు అక్టోబరు 4 నుంచి అమలు

బ్రిటన్ ప్రభుత్వం వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ వచ్చే విద్యార్థులకు, సందర్శకులకు వీసా ఫీజు పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంచిన వీసా ఫీజులు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 

ఆర్నెల్ల కంటే తక్కువ సమయం బ్రిటన్ లో ఉండే సందర్శకులకు వీసా ఫీజుపై రూ.1,543... విద్యార్థుల వీసా ఫీజును రూ.13,070 మేర పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పెంచిన ఫీజు అనంతరం సందర్శకుల వీసా కోసం రూ.11,835 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టూడెంట్ వీసా కోసం రూ.50,428 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్లమెంటులో చట్టం కూడా తయారైందని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

కాగా, పెంచిన వీసా ఫీజులు, హెల్త్ సర్ చార్జీల ద్వారా వచ్చే సొమ్మును జాతీయ ఆరోగ్య పథకానికి అందిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.

Visa
Fee
Student
Visitors
Rishi Sunak
UK
  • Loading...

More Telugu News