Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీలో భారీ ర్యాలీ

Telugu people conduct rally in New Jersey

  • స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • ఏపీ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల నిరసనలు
  • అమెరికాలో టీడీపీ, జనసేన జెండాలతో నిరసన ప్రదర్శన

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం పట్ల ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోనూ చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేపడుతున్నారు. న్యూజెర్సీలో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. మేమంతా చంద్రబాబునాయుడితోనే అనే బ్యానర్ ను, సేవ్ ఏపీ తదితర నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ టీడీపీ, జనసేన జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు స్పందిస్తూ, నాడు చంద్రబాబు తీసుకొచ్చిన విద్యాప్రమాణాల వల్లే తాము విదేశాల్లో మెరుగైన అవకాశాలు పొంది స్థిరపడ్డామని వివరించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఎలుగెత్తారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.

Chandrababu
Arrest
Rally
New Jersey
TDP
USA
  • Loading...

More Telugu News