Raghu Rama Krishna Raju: ఢిల్లీలో లోకేశ్ ను కలిసిన రఘురామ... ఎక్స్ లో ఆసక్తికర పోస్టు

Raghu Rama met Lokesh in Delhi

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • జాతీయ మీడియాకు వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేశ్
  • లోకేశ్ తో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో పంచుకున్న రఘురామ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అని, ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ జాతీయ మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. తమ భేటీ గురించి రఘురామ ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. లోకేశ్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో పంచుకున్న ఆయన... 'సాక్షి' గ్యాంగ్ ఏడవాలి అంటే మేం ఈ మాత్రం నవ్వాలిగా అని పేర్కొన్నారు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది.

Raghu Rama Krishna Raju
Nara Lokesh
New Delhi
TDP
YSRCP
Skill Development

More Telugu News