Tollywood: ‘ఉస్తాద్’ సెట్ నుంచి పవర్ స్టార్ ఫొటోలు.. ఖాకీ డ్రెస్సులో ఖతర్నాక్ లుక్

- హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా
- హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ల షూటింగ్
- హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే వేసవిలో దీనిని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేక సెట్‌లో నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతోంది.

