Gogineni Prasad: సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత

Tollywood producer Gogineni prasad passes away

  • కొండాపూర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన ప్రసాద్
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • మహాప్రస్థానంలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. 'పల్నాటి పులి', 'శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం', 'ఈ చరిత్ర ఏ సిరాతో' వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. గోగినేని ప్రసాద్ కుమారుడు అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తోంది.

Gogineni Prasad
Tollywood
  • Loading...

More Telugu News