Poonam Kaur: చంద్రబాబు జైల్లో ఉండడం పట్ల పూనమ్ కౌర్ స్పందన

Poonam Kaur reacts on Chandrababu being imprisoned

  • టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో రిమాండ్
  • రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు
  • 73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదన్న పూనమ్ కౌర్
  • చంద్రబాబు వయసును పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి 

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించారు. చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకుని విచారం వ్యక్తం చేశారు. 

"73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదు. ముఖ్యంగా, ప్రజా జీవితంలో చాలాకాలం సేవలు అందించిన తర్వాత ఇలా జైల్లో ఉండడం బాధాకరం. ఇప్పుడు జరుగుతున్న విషయాలపై నాకెలాంటి అధికారం కానీ, సంబంధం కానీ లేదు. కానీ మానవత్వంతో స్పందిస్తున్నాను. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని తెలిపారు.

Poonam Kaur
Chandrababu
Jail
Arrest
CID
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News