Chandrababu: చంద్రబాబు ఉన్న బ్లాక్ ను పరిశీలించిన జైళ్ల శాఖ డీఐజీ

DIG inspects Chandrababu block in jail

  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు
  • బాబు భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
  • చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీసిన డీఐజీ

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు భద్రత గురించి భువనేశ్వరి కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ ను జైళ్ల శాఖ డీఐజీ పరిశీలించారు. చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. మరోవైపు జైల్లో చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పిస్తున్నారు. ఆయనకు ఒక సహాయకుడిని కూడా నియమించారు.

Chandrababu
Telugudesam
rajahmundry jail
  • Loading...

More Telugu News