AP Cabinet: ఈ నెల 20న ఏపీ క్యాబినెట్ సమావేశం

AP Cabinet meeting will held on September 20

  • ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • ఒకరోజు ముందు సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ బేటీ
  • పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్న క్యాబినెట్

సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 20న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సెప్టెంబరు 21 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న నేపథ్యంలో, ఒకరోజు ముందు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. 

కాగా, అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరుగుతాయని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, మరో రెండు రోజులు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

AP Cabinet
Meeting
Jagan
AP Assembly Session
YSRCP
  • Loading...

More Telugu News