Nani: 'డాన్' డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని!

Nani in Shibi Chakravarthi movie

  • 'హాయ్ నాన్న' సినిమాతో బిజీగా నాని 
  • శిబి చక్రవర్తితో ప్రాజెక్టుకి సన్నాహాలు 
  • దసరాకి జరగనున్న పూజా కార్యక్రమాలు
  • సంగీత దర్శకుడిగా తెరపైకి అనిరుధ్ పేరు  

నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కంటెంట్ బాగుంటే ఇతర భాషలకు చెందిన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆయన ఎంత మాత్రం వెనకాడటం లేదు. ప్రస్తుతం 'హాయ్ నాన్న' సినిమా షూటింగులో ఆయన బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. 

నాని చేత ఓకే అనిపించుకున్న ఆ దర్శకుడు పేరు శిబి చక్రవర్తి. ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఇంతకుముందు శివ కార్తికేయన్ తో 'డాన్' సినిమాను రూపొందించాడు. 2022లో విడుదలైన ఈ సినిమా, శివ కార్తికేయన్ కెరియర్లో 100 కోట్లను కొల్లగొట్టినదిగా నిలిచింది. ఆ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో, నాని ఆసక్తిని చూపించాడని టాక్. 

 శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అంటున్నారు. 'దసరా' పండగకి ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 'డాన్'కి సంగీతాన్ని అందించిన అనిరుధ్ నే ఈ సినిమా కోసం తీసుకున్నారని టాక్. 

Nani
Shibhi Chakravarthi
Kollywood
  • Loading...

More Telugu News