Vijayasai Reddy: చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy response on Chandrababu jail life

  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు
  • చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు
  • 2024 నుంచి రాజకీయాల్లో చంద్రబాబు కనిపించరన్న విజయసాయి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు 7691 నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వియసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691.
7 6 9 1 = 23. చంద్రబాబు గారూ... మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు' అని ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రబాబు జైలుకు వెళ్లడంపై వైసీపీ మంత్రులు, నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి రోజా టపాసులు కాల్చి, కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News