Jayam Ravi: ప్రతీకారం తీర్చుకునే వేళయ్యింది .. 'సైరన్' మోగిస్తున్న జయం రవి!

Siren movie update

  • జయం రవి బర్త్ డే ఈ రోజు 
  • ఆయన తాజా చిత్రమైన 'సైరన్' నుంచి పోస్టర్ రిలీజ్
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ  
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న కీర్తి సురేశ్  


కోలీవుడ్ స్టార్ హీరోలలో జయం రవి ఒకరు. అందాల హీరోగా అక్కడ ఆయనకి పేరు. 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో తన స్టార్ డమ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిన రవి, మరో ప్రాజెక్టుకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు .. ఆ సినిమా పేరే 'సైరన్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా నడుస్తుంది. 

ఈ రోజున జయం రవి పుట్టినరోజు .. అందువలన ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోలీస్ వారి నుంచి తప్పించుకున్నట్టుగా ఆయన ఒక చేతికి సంకెళ్లు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆయన మారణకాండను మొదలెట్టినట్టుగా రక్తంతో తడిసిన కత్తి చేతిలో కనిపిస్తోంది. జరిగిన దాని గురించి ఆయన ఎంత మాత్రం భయపడకుండా కూల్ గా టీ తాగుతూ ఉండటం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. 

ఇదంతా చూస్తుంటే జయం రవి ఈ సినిమాలో ఒక నేరస్థుడుగా కనిపించనున్నాడు. ఇక ఆయనను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో అనుపమ పరమేశ్వరన్ .. సముద్రఖని .. యోగిబాబు కనిపించనున్నారు.

Jayam Ravi
Keerthy Suresh
Anupama paeameshwaran
Siren Movie
  • Loading...

More Telugu News