Chiranjeevi: 'వినాయకచవితి' స్పెషల్ గా నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'భోళా శంకర్'
- ఆగస్టు 11న విడుదలైన 'భోళా శంకర్'
- ఆశించినస్థాయిలో వర్కౌట్ కాని రీమేక్
- థియేటర్ల నుంచి పెద్దగా రాని రెస్పాన్స్
- ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ మొదలు
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందిన 'భోళా శంకర్', ఆగస్టు 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో చిరూ జోడీగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపిస్తుంది. గతంలో తమిళంలో విజయాన్ని సాధించిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
చిరంజీవి సినిమా నుంచి ఆయన అభిమానులు కోరుకునే మాస్ మసాలాలు వేస్తూనే ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం వలన .. అవసరం లేకపోయినా కామెడీ టచ్ ఇవ్వడానికి ట్రై చేయడం వలన .. ఆశించిన స్థాయిలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ను వర్కౌట్ చేయకపోవడం వలన, ఈ సినిమా పరాజయం పాలైంది. తమన్నా పాత్ర వైపు నుంచి కూడా గ్లామర్ తగ్గడం మరో కారణంగా వినిపించింది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ సినిమాను థియేటర్లలో చూసినవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అందువలన ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ ఉంటుందనే భావిస్తున్నారు.