Governor: టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు

Governor appointment for TDP leaders cancelled

  • విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్
  • నిన్ననే గవర్నర్ ను కలవాలని భావించిన టీడీపీ నేతలు
  • అపాయింట్ మెంట్ నేటికి వాయిదా
  • అయితే చంద్రబాబుపై కోర్టులో విచారణ జరుగుతున్నందున నేటి అపాయింట్ మెంట్ రద్దు

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, టీడీపీ నేతలు గవర్నర్ ను కలవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు చేశారు. వాస్తవానికి టీడీపీ నేతలు నిన్ననే గవర్నర్ ను కలవాలని భావించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయనను కలవాలని అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితర నేతలు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఆదివారం ఉదయం 9.45 గంటలకు అపాయింట్ మెంట్ కోరారు. అయితే, చంద్రబాబు వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ అపాయింట్  మెంట్ ను రద్దు చేశారు.

Governor
Appointment
TDP
Chandrababu
Arrest
ACB Court
  • Loading...

More Telugu News