Allu Arjun: 'మా'కు, మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun thanked MAA and Manchu Vishnu

  • అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
  • పుష్ప చిత్రంలోని నటనకు గాను నేషనల్ అవార్డు
  • లేఖ పంపిన మంచు విష్ణు
  • మా తరఫున అభినందనలు తెలుపుతూ లేఖ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పై అభినందనల వర్షం కురిసింది. 

'మా' అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు కూడా అల్లు అర్జున్ అభినందిస్తూ 'మా' తరఫున లేఖ పంపారు. ఇంతటి విశిష్ట గుర్తింపుకు అల్లు అర్జున్ అర్హుడని, అల్లు అర్జున్ అంకితభావం, కఠోర శ్రమ, అద్భుతమైన నటనతో జాతీయ పురస్కారాన్ని సాధించాడని మంచు విష్ణు కొనియాడారు. ఈ అవార్డు అభిమానులకు, శ్రేయోభిలాషులకు మాత్రమే కాకుండా, చిత్ర పరిశ్రమకు కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. 

కాగా, 'మా' లేఖపై అల్లు అర్జున్ స్పందించారు. 'మా'కు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఎంతో చక్కని లేఖ పంపారని, మంచు విష్ణు హార్దిక అభినందనలు హృదయాన్ని హత్తుకున్నాయని తెలిపారు. ఈ లేఖలోని మిగతా అంశాలను మీతో వ్యక్తిగతంగా పంచుకుంటాను అని మంచు విష్ణును ఉద్దేశించి బన్నీ వ్యాఖ్యానించారు.

More Telugu News