Tirumala: మరోసారి తిరుమల ఆలయం మీద నుంచి వెళ్లిన విమానం
![Airplane went on Tirumala temple](https://imgd.ap7am.com/thumbnail/cr-20230907tn64f976610cdb2.jpg)
- ఇటీవలి కాలంలో తరచుగా ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు
- అభ్యంతరాలను పట్టించుకోని విమానయాన శాఖ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్తుండటం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఓవైపు దీనిపై వివాదం కొనసాగుతుండగానే... ఈరోజు మరోసారి మరో విమానం ఆలయంపై నుంచి వెళ్లింది. ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం ఆగమ శాస్త్రానికి వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ విమానయాన శాఖ అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. తిరుమలపై విమాన రాకపోకలను నిషేధించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను టీటీడీ అధికారులు కోరినప్పటికీ... ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. మరోవైపు ఆలయంపై మరోసారి విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.