United Nation: ‘ఇండియా’ పేరు మార్పు అంశంపై ఐక్యరాజ్య సమితి స్పందన

UN says it considers formal requests on nations name change

  • ఇండియా పేరు మార్పు అంశంపై మీడియా ప్రశ్నలు
  • అధికారికంగా వినతులు వస్తే నిర్ణయం తీసుకుంటామన్న యూఎన్ అధ్యక్షుడి ప్రతినిధి
  • తుర్కియే విషయంలో ఇదే చేశామని వివరణ

దేశాల పేరు మార్పు విషయమై ఆయా ప్రభుత్వాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడి ప్రతినిధి ఫర్హాన్ హక్ బుధవారం పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో విందుకు ఆహ్వానపత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న నేపథ్యంలో మీడియా ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. గతేడాది టర్కీ దేశం పేరు మార్పు విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

‘‘తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పేరు మారుస్తున్నట్టు అధికారికంగా ఐక్యరాజ్య సమితికి తెలిపింది. కాబట్టి.. ఇటువంటి అధికారిక వినతులను పరిణనలోకి తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News