rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

Heavy rain in Hyderabad

  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాంనగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • భారీ వర్షం కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం
  • నగరంలో పలు రోడ్లు జలమయం

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట, మాదాపూర్, ప్రగతినగర్, పటాన్ చెరు, కొత్తగూడ, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, వారాసిగూడ, అడిక్‌మెట్, జీడిమెట్ల, ప్యారడైజ్, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ, నాగోలు, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గురు, శుక్రవారాలు కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

rain
Hyderabad
  • Loading...

More Telugu News