Roja: ఇండియా పేరు మార్పుపై రోజా స్పందన

Bharat name is better than India says Roja
  • ఇండియా పేరును భారత్ గా మారిస్తే మంచిదేనన్న రోజా
  • ఇంగ్లీష్ లో ఇండియా అని పిలవడం కంటే భారత్ అని పిలిస్తే బాగుంటుందని వ్యాఖ్య
  • భారత్ గా పేరు మారిస్తే స్వాగతిస్తానన్న మంత్రి
మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇండియా పేరును భారత్ గా మారిస్తే మంచిదేనని చెప్పారు. ఇంగ్లీష్ లో ఇండియా అని పిలవడం కంటే మన భాషలో భారత్ అని పిలవడం బాగుంటుందని అన్నారు. భారత్, భారతదేశం అనే పదాలు చిన్నప్పటి నుంచి మనకు సుపరిచితం అని చెప్పారు. ఇండియా పేరును భారత్ గా మారిస్తే స్వాగతిస్తానని అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
Roja
YSRCP
India
Bharat

More Telugu News