ATM: వచ్చేస్తోంది యూపీఐ ఏటీఎం.. స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చిక!

ATM Cash Withdrawal using UPI

  • యూపీఐ క్యూఆర్‌‌ కోడ్‌ను స్కాన్‌ చేసి విత్‌డ్రా చేసేకునే ఫీచర్‌‌
  • ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ప్రదర్శన 
  • త్వరలోనే అందరికీ అందుబాటులోకి

ఇంటర్నెట్ విస్తృతి పెరిగి టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్తకొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే స్టార్టప్స్ వెలుగుచూస్తున్నాయి. కరోనా తర్వాత భారత్‌లో యూపీఐ సేవలు గణనీయంగా పెరిగాయి. దాంతో, బ్యాంకింగ్ సేవలు జనాలకు సులభతరం అయ్యాయి. ఏటీఎంలలో కూడా కార్డ్ లెస్ సేవలు వచ్చాయి. ఇందులో మరో ముందడుగుగా యూపీఐతో ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఈ ప్రత్యేక సాఫ్ట్ వేర్‌‌ను రూపొందించిన ఏటీఎంను ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏటీఎం డిస్‌ప్లేలో 100, 500, 1000, 2000, 5000 వేలు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. వేరే అమౌంట్‌ కావాలంటే మరో ఆఫ్షన్ కూడా ఇచ్చారు. మనకు ఎంత నగదు కావాలో దానిపై టచ్‌ చేస్తే డిస్‌ప్లేపై క్యూ ఆర్‌‌ కోడ్ వస్తుంది. మన ఫోన్‌లోని ఏదైనా యూపీఐ యాప్‌లోని స్కానర్‌‌ను ఓపెన్‌ చేసి ఆ క్యూర్‌‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పిన్‌ నంబర్‌‌ ఎంటర్‌‌ చేయగానే ఏటీఎం నుంచి డబ్బు వస్తుంది. ఎలాంటి ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే ఈ సౌకర్యం త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ATM
UPI atm
Cash Withdrawa

More Telugu News