Weapon: సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణతో తెరకెక్కుతున్న 'వెపన్'

Weapon film unit press meet

  • వసంత్ రవి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో వెపన్
  • గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో చిత్రం
  • నేడు మీడియా ముందుకు వచ్చిన చిత్రబృందం

బాహుబలి చిత్రంలోని కట్టప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సీనియర్ నటుడు సత్యరాజ్ తాజాగా 'వెపన్' చిత్రంలో నటిస్తున్నారు. వసంత్ రవి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో 'వెపన్' చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. 

కాగా, 'వెపన్' చిత్రబృందం నేడు ప్రెస్ మీట్ నిర్వహించింది. సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, నిర్మాత మంజూర్, దర్శకుడు గుహన్ సెన్నియప్పన్, రాజీవ్ పిళ్లై ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చిత్ర విశేషాలను వారు మీడియాకు తెలిపారు. 

సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణ ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. యషికా ఆనంద్, మైమ్ గోపి, కణిత, సయ్యద్ సుభాన్, భరద్వాజ్ రంగన్, గజరాజ్ ఇతర పాత్రలు పోషించారు. మిలియన్ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కుతున్న 'వెపన్' చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.

Weapon
Unit
Press Meet
Satyaraj
Vasant Ravi
Guhan Senniappan
  • Loading...

More Telugu News