Haryana: భర్తపై ఫిర్యాదుకు వచ్చిన మహిళపై ఎస్సై సహచరుల సామూహిక అత్యాచారం.. ఆపై మరో వ్యక్తికి విక్రయం

Married woman gangraped by cops aides in Haryana
  • హర్యానాలోని పల్వాల్‌లో ఘటన
  • ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించి తన సహచరులతో పంపిన ఎస్సై
  • గదిలో బంధించి మూడు రోజులపాటు అత్యాచారం
  • ఎస్సై సమక్షంలో మరోమారు లైంగికదాడికి గురైన బాధితురాలు
తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై ఎస్సై సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను ఓ వ్యక్తికి విక్రయించడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. హర్యానాలోని పల్వాల్‌లో జరిగిందీ దారుణం. నిందితులు మహిళను ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారు ఆమెను మరో వ్యక్తికి విక్రయించగా అతడు కూడా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై సహా ఏడుగురిపై కేసు నమోదైంది. నిందితుల్లో ఒకడి ఫోన్‌ను దొరకబుచ్చుకుని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రక్షించిన పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

పోలీసుల కథనం ప్రకారం బాధితురాలు జులై 23న హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమె ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించిన ఎస్సై శివ్ చరణ్.. తన సహచరుడు బాలితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లాలని బెదిరించాడు. అక్కడ అప్పటికే నిరంజన్, భీమా వేచి చూస్తున్నారు. అక్కడామెపై అత్యాచారానికి పాల్పడిన వారు ఆ ఘటనను వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి పల్వాల్‌లో శాంతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడామెపై రాత్రంతా లైంగికంగా వేధించారు. అనంతరం బిజేంద్ర అనే వ్యక్తికి ఆమెను విక్రయించారు. అతడు తన బావమరిది గజేంద్రతో కలిసి ఎస్సై శివ్ చరణ్ సమక్షంలోనే అత్యాచారం చేశాడు.
Haryana
Woman Assaulted
Crime News

More Telugu News