Venkateswara Hatcheries: వెంకటేశ్వర హేచరీస్ కు చెందిన కోట్లాది విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
- యూకేలో వెంకీస్ ఓవర్సీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన వెంకటేశ్వర హేచరీస్
- అలెగ్జాండర్ హౌస్ పేరుతో 90 ఎకరాలు కొనుగోలు చేసిన వైనం
- ఫెమా ఉల్లంఘనలను వెంకటేశ్వర హేచరీస్ ఉల్లంఘించిందన్న ఈడీ
పౌల్ట్రీ రంగంలో పేరుగాంచిన సంస్థ వెంకటేశ్వర హేచరీస్. అయితే ఈ సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందంటూ సంస్థకు చెందిన రూ. 65.05 కోట్ల విలువైన 9 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే, యూకేలో వెంకీస్ ఓవర్సీస్ లిమిటెడ్ పేరుతో వెంకటేశ్వర హేచరీస్ ఒక సంస్థను ఏర్పాటు చేసింది. అలెగ్జాండర్ హౌస్ పేరుతో అక్కడ 90 ఎకరాల భూమిని వెంకీస్ ఓవర్సీస్ కొనుగోలు చేసింది. ఈ భూమిని వెంకటేశ్వర హేచరీస్ డైరెక్టర్ల కోసం కొన్నట్టు ఈడీ గుర్తించింది. దీనికోసం వెంకీస్ ఓవర్సీస్ సంస్థకు రూ. 65.05 కోట్లను వెంకటేశ్వర హేచరీస్ కు మళ్లించిందని ఈడీ తేల్చింది. ఈ క్రమంలో ఫెమా నిబంధనలను వెంకటేశ్వర హేచరీస్ ఉల్లంఘించిందని ఈడీ గుర్తించింది.