Roja: రజనీకాంత్ ను నేను విమర్శించలేదు.. ఆ మాటను మాత్రమే ఖండించాను: రోజా

I never criticised Rajinikanth says Roja
  • చంద్రబాబును గెలిపించండని రజనీ చెప్పడాన్ని ఖండించానన్న రోజా
  • బాబులాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీ ఇమేజ్ తగ్గుతుందని వ్యాఖ్య
  • ప్రతి ఎమ్మెల్యేపై లోకేశ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో మంత్రి రోజా కూడా ఉన్నారు. అయితే, ఈరోజు ఆమె మాట్లాడుతూ రజనీకాంత్ ను తాను విమర్శించలేదని చెప్పారు. చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండి.. ఏపీని ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి చంద్రబాబు తీసుకొస్తారని ఆయన చెప్పడాన్ని మాత్రమే తాను ఖండించానని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అన్నానని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇల్లు లేవని... హైదరాబాద్ నుంచి వచ్చి వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఎమ్మెల్యేపై నారా లోకేశ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు.
Roja
YSRCP
Rajinikanth
Tollywood
Chandrababu
Nara Lokesh
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News