ginger: పచ్చి అల్లం మంచిదా? లేక ఎండు అల్లం మంచిదా?
- రెండూ ఆరోగ్యపరంగా మంచివే
- ప్రయోజనాల్లో వత్యాసం
- ఎండు అల్లం (శొంఠి)తో మరిన్ని లాభాలు
అల్లం రుచిని పెంచడంతో పాటు.. ఆహారానికి మంచి సువాసన ఇస్తుంది. ఆయుర్వేదం అల్లాన్ని ఔషధంగా పరిగణిస్తోంది. జీర్ణ సంబంధ సమస్యలు, అజీర్ణం, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది. అల్లాన్ని ఎండు రూపంలో తీసుకుంటే దాన్ని శొంఠిగా పరిగణిస్తారు. అల్లం, శొంఠి ఒక్కటే. తాజా అల్లం, ఎండబెట్టిన అల్లంలో గుణాల పరంగా వ్యత్యాసం ఉంది.
- ఎండు అల్లం సుఖ విరేచనకారి. మలబద్ధకానికి మంచి పరిష్కారం. ఉదయం విరేచనానికి ఇబ్బంది పడుతుంటే గ్లాసున్నర నీళ్లలో అల్లం రసాన్ని కలుపుకుని తాగాలి.
- ఎండు అల్లానికి స్నిగ్ధ గుణం ఉంటుంది. దీర్ఘకాలం పాటు దీన్ని వాడుకోవచ్చు. దీర్ఘకాలానికి చాలా మంచిది. తాజా అల్లాన్ని వారంలో ఒక్కసారి తీసుకోవచ్చు.
- ఎండు అల్లం కఫాన్ని తగ్గిస్తుంది. తాజా అల్లం కఫాన్ని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే ఫ్లూ, జలుబు, దగ్గు, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సమస్యల్లో ఎండు అల్లం ఔషధంగా పనిచేస్తుంది.
- ఒక అంగుళం సైజులోని శొంఠిని రెండు గ్లాసుల నీటిలో మరిగించాలి. దాన్ని చల్లార్చుకుని తాగాలి.
- తాజా అల్లాన్ని బెల్లంతో కలిపి తీసుకుంటే కడుపులో జీర్ణ సామర్థ్యాన్ని ప్రేరేపిస్తుంది. మలాన్ని పలుచన చేస్తుంది. ఎండు అల్లం కూడా ఇదే మాదిరి ఫలితాలను ఇస్తుంది.