Vishal: విశాల్‌ ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

Rana released Mark Antony trailer

  • విశాల్  కొత్త చిత్రం 'మార్క్ ఆంటోని'
  • అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చిత్రం
  • వినాయకచవితికి రిలీజవుతున్న చిత్రం
  • సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు!
  • విశాల్ నట విశ్వరూపాన్ని చూపిస్తున్న ట్రైలర్

విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు బాగా దగ్గరైన క‌థానాయ‌కుడు విశాల్. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. 

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘మార్క్ ఆంటోని’ మూవీ సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను వెర్సటైల్ స్టార్ రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు.

ట్రైలర్ చూస్తే... ఇప్ప‌టి వ‌ర‌కు విశాల్ చేసిన సినిమాల‌న్నీ ఒక ఎత్తైతే ‘మార్క్ ఆంటోని’ మ‌రో ఎత్తు అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో ఆయ‌న చేసిన క్యారెక్ట‌ర్స్‌లోని షేడ్స్ ఇది వ‌ర‌కటి కంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఓ వైపు క్రూర‌మైన విల‌న్‌గా క‌నిపిస్తున్నారు. మ‌రో వైపు గుండుతో స్టైలిష్‌గా ఆక‌ట్టుకుంటున్నారు. మ‌రోవైపు తండ్రిని కాపాడుకోవాల‌నుకునే, అలాగే చంపాల‌నుకునే యువ‌కుడిగానూ ఉన్నారు.

 సాధార‌ణంగా మ‌న ఆడియెన్స్ టైమ్ మిష‌న్‌ను చూశారు. అందులో మ‌న నాయ‌కానాయిక‌లు గ‌తానికి వెళ్ల‌ట‌మో, భ‌విష్య‌త్ కాలానికి వెళ్ల‌టాన్ని చూపించారు. ‘మార్క్ ఆంటోని’లో అలాంటి కాన్సెప్ట్ ఉంది. సునీల్, సెల్వ రాఘ‌వ‌న్ పాత్ర‌లు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.  

ఓ టైమ్ మిష‌న్ కాకుండా ఓ ఫోన్ మ‌న హీరోని గ‌తానికి తీసుకెళ్తే త‌నేం చేశాడ‌నే క‌థాంశంతో మార్క్ ఆంటోని సినిమా తెర‌కెక్కింది. ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే డిఫ‌రెంట్ ఎమోష‌న‌ల్ మూవీగా ఎంట‌ర్‌టైన్ చేయ‌నుంద‌ని ట్రైల‌ర్‌లో తెలుస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ సంగీతం అందించారు. వెర్సటైల్ డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ ఎస్‌.జె.సూర్య ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ కూడా వెరైటీగా ఉంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ మూవీపై ఆస‌క్తిని పెంచాయి. తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. మార్క్ ఆంటోని చిత్రంలో సునీల్, సెల్వ రాఘ‌వ‌న్‌, రీతూ వ‌ర్మ‌, అభిన‌య‌, కింగ్ స్లే, వై.జి.మ‌హేంద్ర‌న్ త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు.

More Telugu News