Allu Arjun: నిర్మాతల మండలికి కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun thanked TFPC

  • అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు
  • అభినందించిన నిర్మాతల మండలి
  • ఓ ప్రకటన విడుదల
  • కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ప్రతిభావంతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ను అభినందిస్తూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్ పీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. పుష్ప చిత్రంలో తిరుగులేని నటనతో 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నిలిచినందుకు సంతోషిస్తున్నట్టు నిర్మాతల మండలి పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఇది గర్వకారణమని తెలిపింది. 

దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తనను అభినందిస్తూ లేఖ విడుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ లేఖ తనను ముగ్ధుడ్ని చేసిందని వివరించారు. ఈ మేరకు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు.

Allu Arjun
Best Actor
National Award
TFPC
Pushpa
Tollywood

More Telugu News