Nayanthara: నయనతార మాజాకా.. ఇన్‌స్టాలోకి వచ్చిన గంటల్లోనే లక్షలాది ఫాలోవర్లు

Nayanthara makes Instagram debut ahead of Jawan trailer shares video with sons

  • దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఉన్న నయన్
  • ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్
  • రెండు గంటల్లోనే నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు సొంతం

పదేళ్లకు పైగా దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి నయనతార. ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. లేడీ సూపర్ స్టార్ గా చాలా స్టార్డమ్ సొంతం చేసుకున్న నయనతార సినిమా ప్రమోషన్లకు, సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే, తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ జైలర్‌ చిత్రంలోని టైగర్ కా హుకుమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన ఇద్దరు కవల పిల్లలను ఎత్తుకుని స్టయిల్‌గా నడుస్తున్న వీడియోను షేర్ చేసింది. దాంతో పాటు ‘జవాన్’ హిందీ, తమిళ ట్రైలర్ వీడియోలను కూడా షేర్ చేసింది.

నయన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే లక్షల్లో ఫాలోవర్స్ చేరారు. కేవలం రెండు గంటల్లోనే నాలుగున్నర లక్షల మంది ఆమెను ఫాలో చేశారు. నయన్ మాత్రం ఐదుగురినే ఫాలో అవుతోంది. మొదటగా భర్త విఘ్నేష్ తర్వాత షారుక్ ఖాన్‌, అనిరుధ్‌లతో పాటు తమ ప్రొడక్షన్‌ సంస్థ ది రౌడీ పిక్చర్స్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను ఫాలో అవుతోంది.

More Telugu News