Manda Krishna Madiga: కడియం శ్రీహరి ఒక గుంటనక్క: మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga fires on Kadiam Srihari

  • స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించిన కేసీఆర్
  • రాజయ్యకు టికెట్ రాకపోవడానికి శ్రీహరి కారణమన్న మంద కృష్ణ
  • మాదిగ టికెట్ ను మరో మాదిగకే ఇవ్వాలని డిమాండ్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ ను కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటియించడంపై ఆయన మండిపడ్డారు. కడియం శ్రీహరి ఒక గుంటనక్క అని అన్నారు. గతంలో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి పోవడానికి కడియం శ్రీహరి కారణమని, ఇప్పుడు ఆయనకు టికెట్ రాకపోవడానికి కూడా ఆయనే కారణమని అన్నారు. మాదిగ టికెట్ ను మాదిగకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ అయిన రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే... ఆ టికెట్ ను మరో మాదిగకే ఇవ్వాలని అన్నారు. కడియం శ్రీహరికి బీఫామ్ ఎలా వస్తుందో తాను చూస్తానని సవాల్ విసిరారు.

Manda Krishna Madiga
Kadiam Srihari
Rajaiah
BRS
MRPS
  • Loading...

More Telugu News