Eturnagaram: వేర్వేరు బ్యాంకులకు చెందిన 50 మంది ఖాతాల్లో వేలాది రూపాయలు జమ.. వెంటనే వేరే ఖాతాలకు మళ్లింపు

Unknown persons transferred money to 50 accounts
  • ములుగు జిల్లా ఏటూరునాగారాంలో ఘటన
  • రూ. 2 వేల నుంచి రూ. లక్ష వరకు జమ
  • వెంటనే వేరే ఖాతాలకు మళ్లింపు
  • ఇంటెలిజెన్స్, పోలీసుల ఆరా
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ బ్యాంకు ఖాతాదారుల్లో అకస్మాత్తుగా వేల రూపాయలు జమయ్యాయి. మెసేజ్ వచ్చిన వెంటనే వారంతా పేమెంట్ యాప్‌ల ద్వారా తమ వేరే ఖాతాలకు ఆ సొమ్మును బదిలీ చేసుకున్నారు. కొందరి ఖాతాల్లో రూ. 2 వేలు, మరికొందరి ఖాతాల్లో రూ. 5 వేలు, రూ. 10 వేలు జమ అయితే, ఇంకొందరి ఖాతాల్లో మాత్రం రూ. లక్ష వరకు జమ అయ్యాయి. ఆ డబ్బును ఎవరు వేశారో? ఎందుకు వేశారో తెలియక ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. 

ఎస్బీఐ, ఏపీజీవీబీ, కెనరా బ్యాంకు.. ఇలా  వేర్వేరు బ్యాంకులకు చెందిన దాదాపు 50 మంది ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. డబ్బులు పొరపాటున వచ్చాయని అనుకోవడానికి కూడా లేదని, ఎందుకంటే నిన్న శనివారం బ్యాంకులు బంద్ అని ఖాతాదారులు చెబుతున్నారు. విషయం తెలిసిన ఇంటెలిజెన్స్ వర్గాలు, స్థానిక పోలీసులు ఆరా తీశారు.
Eturnagaram
Mulugu
Bank Accounts
Money Transfer

More Telugu News