Nara Lokesh: జగన్ ఏపీ పరువు తీశాడు: నారా లోకేశ్

Nara Lokesh slams AP CM Jagan

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం
  • నూజివీడు నియోజవర్గంలో పాదయాత్ర
  • ముసునూరులో రచ్చబండ నిర్వహించిన లోకేశ్
  • జగన్ బటన్ కు పవర్ పోయిందని ఎద్దేవా
  • నూజివీడు కబ్జాలపై సిట్ వేస్తామని వెల్లడి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి లోకేశ్ శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మెట్టప్రాంతాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. 

195వ రోజు పోతిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర కొర్లగుంట మీదుగా సింహాద్రిపురం, చెక్కపల్లి క్రాస్, చిలుకానగర్ క్రాస్, ముసునూరు మీదుగా వలసపల్లి క్యాంప్ సైట్ కి చేరుకుంది. కాగా, ముసునూరు గ్రామస్తులతో లోకేశ్ రచ్చబండ నిర్వహించారు.

రచ్చబండలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

జగన్ బటన్ కి పవర్ పోయింది!

జగన్ ది బటన్ ప్రభుత్వం కాదు బఫూన్ ప్రభుత్వం. దేశం మొత్తం ఏపీ వైపు చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు బటన్ కి పవర్ పోయింది. అభివృద్ది చేసి సంక్షేమం చెయ్యాలి కానీ జగన్ అప్పు చేసి సంక్షేమం చేస్తున్నాడు. ఇప్పుడు అప్పు ఇచ్చే వాడు లేక బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదు. 

జగన్ ప్రజలపై భారం వేసి సంక్షేమం అంటున్నాడు. కరెంట్ ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాడు. రాజధాని లేని రాష్ట్రం, పవర్ లేని రాష్ట్రం మనదే. పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడేలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

ఏపీ పరువు తీసిన జగన్!

జగన్ ఏపీ పరువు తీశాడు. జగన్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేసింది. జగన్ పంచాయతీ డబ్బులు కాజేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచుల గౌరవం నిలబెడతాం. ముసునూరు కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కొత్త రోడ్లు వేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ప్రాజెక్టు రెండేళ్లలోనే పూర్తి చేస్తాం.

నూజివీడు భూకబ్జాలపై సిట్ వేస్తాం

ఇక్కడ ఎమ్మెల్యే కంటే ఆయన అబ్బాయి కేటుగాడు. భూకబ్జాలు, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీకి నూజివీడుని కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూజివీడులో జరిగిన భూకబ్జాలు ఇతర అరాచకాలపై సిట్ వేసి అవినీతి బయటపెడతాం. 

నేను జగన్ లాగా "ముఖ్యమంత్రిని కాల్చాలి, చెప్పుతో కొట్టాలి, రోడ్డు మీద కాల్చేయాలి" అని రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. మా తల్లిని అవమానించారు, పార్టీ కార్యాలయంపై దాడి చేశారు, మా ఇంటిపై దాడి చేశారు. అప్పుడు పోలీసులకు రెచ్చగొట్టే చర్యల్లా కనపడలేదు. 

నేను జగన్ చేసే సైకో పనులు చూసి సైకో అనడం తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ చెయ్యలేదు. లోకేశ్ ను చూస్తే జగన్ కి ప్యాంటు తడుస్తుంది. అందుకే పాదయాత్ర అడ్డుకుంటున్నాడు. నాపై కేసులు పెడుతున్నాడు. 

జగన్ తినేది ఇసుక మాత్రమే

జగన్ అన్నం తినడు... ఇసుక తింటాడు. రోజుకి ఇసుకలో మూడు కోట్లు తింటున్నాడు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ రూ.1500 ఉంటే ఇప్పుడు జగన్ పాలన లో రూ.5000. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు తగ్గిస్తాం. 

మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ కి టీడీపీ హయాంలో 700 పరిశ్రమలను తీసుకొస్తే, సైకో పాలన చూసి ఇతర రాష్ట్రాలకు పారిపోయారు.

జగన్ కోరిక అదే!

జగన్ పేదలకు ఉచితంగా ఇళ్లు కడతా అన్నాడు. ఇప్పుడు మీరే కట్టుకోండి అని చేతులు ఎత్తేశాడు. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది జగన్ కోరిక. 7 లక్షలు అప్పు చేస్తే కానీ పేదలు సెంటు స్థలంలో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. నూజివీడులో టీడీపీ జెండా ఎగరేయండి. అభివృద్ధి చేసే బాధ్యత నాది. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2613 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 17.2 కి.మీ.*

*196వరోజు (27-8-2023) యువగళం వివరాలు*

*చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*

సాయంత్రం

4.00 – వలసపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం

4.30 – వలసపల్లిలో స్థానికులతో సమావేశం

4.50 – పాదయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోకి ప్రవేశం.

6.20 – ధర్మాజీగూడెంలో స్థానికులతో సమావేశం.

7.50 – మట్టంగూడెంలో స్థానికులతో సమావేశం.

8.20 – సుందర్రావుపేటలో స్థానికులతో సమావేశం.

8.50 – సుందర్రావుపేట శివారు విడిది కేంద్రంలో బస.

******

Nara Lokesh
Jagan
Yuva Galam Padayatra
Nuzividu
Krishna District
  • Loading...

More Telugu News