Yuvraj Singh: మరోసారి తండ్రి అయిన యువరాజ్ సింగ్.. కుటుంబం పరిపూర్ణమయిందన్న యువీ

Yuvraj Singh and Hazel Keech welcomes baby girl
  • ఆడబిడ్డకు జన్మనిచ్చిన యువీ భార్య
  • నిద్రలేని రాత్రులు ఆనంద ఘడియలుగా మారాయన్న యువీ
  • 2019లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన యువరాజ్
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. యువీ భార్య హేజెల్ కీచ్ ఆడబిడ్డకు  జన్మనిచ్చింది. తన భార్య, కొడుకు, కూతురుతో ఉన్న ఫొటోను యువీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. నిద్ర లేకుండా గడిపిన రాత్రులు ఆనంద ఘడియలుగా మారాయని చెప్పాడు. యువరాణి ఆరా రాకతో తమ కుటుంబం పరిపూర్ణమయిందని తెలిపాడు. 2016లో యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ వివాహం జరిగింది. గత ఏడాది వారికి కొడుకు ఒరియాన్ పుట్టాడు. 2019లో క్రికెట్ కు యువరాజ్ సింగ్ వీడ్కోలు పలికాడు. 

Yuvraj Singh
Daughter
Team India

More Telugu News