Donald Trump: ట్రంప్ ఖైదీ నంబర్ పి01135809.. జైల్లో ఉన్నది 22 నిమిషాలే

Donald Trump Spends 20 Minutes In Georgia Prison
  • ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ట్రంప్‌పై అభియోగాలు
  • తన అరెస్ట్ అమెరికాకు దుర్దినమన్న మాజీ అధ్యక్షుడు
  • రూ. 1.65 కోట్ల పూచీకత్తుతో బెయిల్
2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్టు అభియోగాలు ఎదుర్కొని బుధవారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోయిన ట్రంప్‌ జైలులో 22 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఆ వెంటనే ఆయన రూ. 1.65 కోట్ల పూచీకత్తుతో బెయిలుపై విడుదలయ్యారు. జైలులో లొంగిపోయిన ట్రంప్‌కు అధికారులు పి01135809 నంబరును కేటాయించారు. ఆరడుగుల మూడంగుళాల పొడవు, 97 కిలోల బరువు, తెల్లని జట్టు, నీలికళ్లు అని దానిపై పేర్కొన్నారు. 

ట్రంప్ జైలులో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం ట్రంప్‌కు మగ్‌షాట్ (ఫొటో) తీశారు. దీంతో జైలులో ఈ తరహా ఫొటో దిగిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డులకెక్కారు. అంతేకాదు, ఈ ఫొటోను ట్రంప్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘ఎన్నికల్లో జోక్యం’, ‘ఎప్పుడూ లొంగిపోవద్దు’ అని దానికి క్యాప్షన్ తగిలించారు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తన అరెస్ట్ అమెరికాకు దుర్దినమని పేర్కొన్నారు.
Donald Trump
America
Georgia Prison
Donald Trump Mugshot

More Telugu News