patnam mahender reddy: బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలి: మంత్రి మహేందర్ రెడ్డి

Minister Mahender Reddy in Moinabad brs meeting
  • రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని వెల్లడి
  • సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారన్న మంత్రి
  • సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచన
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సమష్టిగా కృషి చేస్తామని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేడు (శుక్రవారం) మొదటిసారి మొయినాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అందరూ సైనికుల్లా కష్టపడి పని చేయాలన్నారు.
patnam mahender reddy
Telangana
BRS

More Telugu News