Vijayasai Reddy: అక్కడ టీడీపీ డిపాజిట్ గల్లంతవడం ఖాయం!: విజయసాయిరెడ్డి

Vijayasaireddy tweet on Chandrababu and Lokesh

  • తండ్రీకొడుకులు తిరిగిన ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోతుందన్న వైసీపీ ఎంపీ
  • వీరి హింసను, రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శ
  • బాకా మీడియా పబ్లిసిటీ తప్ప మరో ప్రయోజనం లేదని తేలిందని వ్యాఖ్య

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

యువగళం, ప్రాజెక్టుల యాత్ర పేరుతో తండ్రీకొడుకులు తిరిగిన ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీకి డిపాజిట్ గల్లంతవడం ఖాయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు చీడపురుగులై, వీళ్ల నోటి దురుసుతనం, అరాచకాలు, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బాకా మీడియా పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదని తేలిపోయిందన్నారు. 

అంతకుముందు, నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. మాట్లాడితే మా తాతగారు ఎన్టీఆర్... అదీ, ఇదీ అంటున్నావని, అసలు పాదయాత్ర ఒకచోట ముగిస్తే మరుసటిరోజు తెల్లారి మరోచోట నుంచి ఎలా మొదలెడుతున్నావో చెప్పాలని ట్వీట్‌లో ప్రశ్నించారు. నిద్దట్లో ఏమైనా నడిచే అలవాటు ఉందా? అని అడిగారు. భవిష్యత్తులో ఏమి చేస్తావో చెప్పలేవు... నోరు విప్పితే బనియన్లు, కట్ డ్రాయర్లంటావు... కనీసం ప్రజల సమస్యలైనా వినడం నేర్చుకో లోకేశ్ అని ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy
Chandrababu
Nara Lokesh
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News