RK: బోల్తా పడిన ఆటో... పరుగు పరుగున వచ్చి సాయపడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

Mangalagiri MLA RK helps to lift overturned auto
  • పెదవడ్లమూడిలో ఘటన
  • బోల్తా పడిన ఆటోలో గర్భవతి ఉన్న వైనం
  • అదే సమయంలో అటుగా వెళుతున్న ఆర్కే కాన్వాయ్
  • కాన్వాయ్ ఆపించి సహాయ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా పెదవడ్లపూడి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఉదయం ఓ ఆటో బోల్తాపడింది. అందులో ఓ గర్భవతి కూడా ఉంది. ఆ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కాన్వాయ్ అటుగా వెళుతోంది. ఆటో బోల్తా పడినట్టు  గుర్తించిన ఎమ్మెల్యే ఆర్కే తన కాన్వాయ్ ని నిలిపారు. పరుగు పరుగున వచ్చి సహాయ చర్యల్లో పాలుపంచుకున్నారు. పోలీసులు, స్థానికుల సహకారంతో ఆయన కూడా ఆటోను ఓ వైపు పైకి లేపి పట్టుకున్నారు. దాంతో, ఆ ఆటోలో ఇరుక్కుపోయిన వారు ఒక్కొక్కరే బయటికి రాగలిగారు. ఆటోలో ఉన్న గర్భిణీ స్త్రీకి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటో నుంచి బయటపడిన ప్రయాణికులను ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
RK
MLA
Auto
Mangalagiri
YSRCP
Guntur District

More Telugu News