Tamannah: రేపు ఓటీటీ ట్రాక్ పైకి వస్తున్న రెండు భారీ వెబ్ సిరీస్ లు ఇవే!

- ఈ నెల 25 నుంచి హాట్ స్టార్ లో 'ఆఖరి సచ్'
- ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించనున్న తమన్నా
- యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సిరీస్
- అదే రోజున జియో సినిమాలో 'బజావ్' స్ట్రీమింగ్
తమన్నా ఇప్పుడు ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఇంతకుముందు ఆమె నుంచి వచ్చిన 'జీ కర్దా' .. 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి రావడానికి మరో సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'ఆఖరి సచ్'. నిర్వికార్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించాడు.
2018లో ఢిల్లీలోని 'బురారీ'లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయారు. వాళ్లంతా కూడా తమ ఇంట్లో 'ఉరి'కి వ్రేళ్లాడుతూ కనిపించారు. అయితే అవి ఆత్మహత్యలా? హత్యలా? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తమన్నా కనిపించనుంది. ఈ నెల 25 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
