Kakarala: పారితోషికం డిమాండ్ చేసే పరిస్థితి అప్పుడు లేదు: సీనియర్ నటుడు కాకరాల

Kakarala Interview

  • నాటకాలపై ఆసక్తి ఉండేదన్న కాకరాల 
  • అదే సినిమా దిశగా నడిపించిందని వివరణ 
  • సీనియర్ దర్శకులు ప్రోత్సహించారని వెల్లడి 
  • కులతత్వం ఇప్పటికీ ఉందంటూ వ్యాఖ్య   


1960 లలో సినిమాల్లోకి వచ్చిన కాకరాల, ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. దాదాపు 4 దశాబ్దాల పాటు నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. తాజాగా 'ఫిల్మ్ ట్రీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. తన గురించిన అనేక విషయాలను చెప్పుకొచ్చారు. "నేను పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనే. మొదటి నుంచి కూడా నేను నాటకాల పట్ల ఆసక్తిని చూపిస్తూ ఉండేవాడిని .. అలా సినిమాల్లోకి వచ్చాను" అని అన్నారు. 

"మా కంటే ముందుగా ఏఎన్నార్ .. జగ్గయ్య సినిమాల్లోకి వెళ్లారు .. వాళ్లను చూసే నేను కూడా వెళ్లాను .. వాళ్లతో కలిసి నటించాను. బి ఎన్ రెడ్డి గారు .. రాజారావుగారు .. కేఎస్ ప్రకాశ్ రావుగారు .. బాపుగారు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. అప్పటికే స్టార్స్ గా నిలదొక్కుకున్న వారు మాత్రమే పారితోషికాన్ని డిమాండ్ చేసేవారు. మిగతా వారికి అలాంటి అవకాశం ఉండేదే కాదు" అని చెప్పారు. 

"నాకు పెద్దగా ఆస్తులు లేవు .. అయినా డబ్బు కోసం ఆశపడకుండా వచ్చిన వేషాలు చేస్తూ వెళ్లాను. నా కుటుంబ నిర్వహణ మొత్తం నా భార్యనే చూసేది. ఆమె సహకారంతోనే నేను నా కెరియర్ పై దృష్టి పెట్టగలిగాను. అప్పట్లో కులతత్వం ఎక్కువగా ఉండేది .. ఇప్పుడు పైకి కనిపించడం లేదు గానీ, అది ఎక్కడికీ పోలేదు .. ఎప్పటికీ ఉంటుంది కూడా" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News