priest: 108 కిలోల చిల్లీ పౌడర్ కలిపిన నీటితో స్నానం

priest bathes in water mixed with 108kg chilli powder vedio Tamil Nadu

  • ఆది అమావాస్య పర్వదినం సందర్భంగా ఓ పూజారి సాహసం
  • భక్తులను దురదృష్టం నుంచి రక్షించాలనే సంకల్పం
  • తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటు చేసుకున్న ఘటన

తమిళనాడులో ఓ పూజారి చేసిన సాహసం పెద్ద సంచలనంగా మారింది. 108 కిలోల కారం కలిపిన నీటితో ఆయన స్నానం చేశారు. దురదృష్టం నుంచి భక్తులను రక్షించాలని కోరుకుంటూ ఆయన ఈ పని చేశారు. ఆది అమావాస్య పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ధర్మపురి జిల్లా నందనపల్లి గ్రామంలో ఇది చోటు చేసుకుంది. 

ఈ పర్వదినం రోజున భక్తులు పవిత్ర స్నానమాచరించడం అనవాయతీ. ఓ పూజారి మాత్రం కారం కలిపిన నీటిని స్నానానికి ఉపయోగించారు. స్టీల్ డ్రమ్ముల్లో నీరు పోసి, అందులో కారం వేసి కలుపుతుండడాన్ని వీడియోలో చూడొచ్చు. చెక్కతో ఏర్పాటు చేసిన స్టేజీపైకి ఎక్కి పూజారి కూర్చోగా సహాయకులు కారం కలిపిన నీటిని అతడి తలపై నుంచి పోశారు. ఇలాంటి ఆచారాలు అక్కడ సాధారణమే. ఆది అమావాస్య అనేది పితృ దేవతలకు సంబంధించిన పర్వదినం. ఉపవాసం, ప్రత్యేక పూజలతో తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని అక్కడి స్థానికులు భావిస్తారు.

  • Loading...

More Telugu News