Business: రియల్ మీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర రూ.20 వేల లోపే!

New smartphone release from Realme today

  • నేడు మార్కెట్లోకి రియల్ మీ 11 రిలీజ్.. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి
  • మిగతా 5జీ ఫోన్లతో పోలిస్తే ధర తక్కువగా ఉండే అవకాశం
  • రియల్ మీ 11 ఎక్స్ మోడల్ కూడా ఈరోజే మార్కెట్లోకి విడుదల

భారత దేశ మొబైల్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ నేడు (ఆగస్టు 23) విడుదల చేయనుంది. రియల్ మీ 11 (5జీ), రియల్ మీ 11 ఎక్స్ పేరుతో రెండు మోడళ్లను లాంచ్ చేయనుంది. మిగతా 5జీ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఈ స్మార్ట్ ఫోన్ల ధర తక్కువగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ-కామర్స్ ప్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ.20 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. రియల్ మీ 11 ఎక్స్ ధర ఎంత ఉంటుందనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు.. రియల్‌ మీ 11 (5జీ)

  • 3 ఎక్స్‌ జూమ్‌తో 108 ఎంపీ కెమెరా
  • 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • కేవలం 17 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు
  • 8 జీబీ 128 జీబీతో పాటు 8 జీబీ 256 జీబీ వేరియంట్‌లో లభ్యం
  • ‘గ్లోరీ హాలో’ డిజైన్‌తో నలుపు, బంగారపు రంగులలో తయారీ
  • ప్రపంచంలోనే మొట్టమొదటి 5జీ తక్కువ-పవర్ హాట్‌స్పాట్‌

రియల్‌ మీ 11 ఎక్స్‌..
  • 64 ఎంపీ ఏఐ కెమెరా
  • 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • 6 జీబీ 128 జీబీ, 8 జీబీ 256 జీబీ వేరియంట్స్‌లో లభ్యం
  • ఎస్‌-కర్వ్ డిజైన్‌తో పర్పుల్, గోల్డ్ రంగుల్లో తయారీ

More Telugu News