Pavan Kalyan: ఈ నెల 25న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై రెండు బ్లాక్ బస్టర్ మూవీస్!
![Bro and Baby Movies OTT Streaming Date Confirmed](https://imgd.ap7am.com/thumbnail/cr-20230823tn64e58afd0a266.jpg)
- ఈ నెల 25న ఓటీటీ సెంటర్స్ లో సందడి
- నెట్ ఫ్లిక్స్ లో 'బ్రో' సినిమా స్ట్రీమింగ్
- అదే రోజున 'ఆహా'లో అందుబాటులోకి 'బేబి'
- ఒక రోజు ముందుగానే అమెజాన్ ప్రైమ్ లో 'స్లమ్ డాగ్ హస్బెండ్'
ఈ శుక్రవారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మీద గట్టిగానే సందడి కనిపించనుంది. ముఖ్యంగా భారీ విజయాలను అందుకున్న రెండు తెలుగు సినిమాలు ఈ వారం ఓటీటీ సెంటర్స్ లోకి దిగుతున్నాయి. ఒకటి 'బేబి' సినిమా అయితే మరొకటి 'బ్రో' మూవీ. ఈ రెండు సినిమాలు జులైలో థియేటర్స్ కి వచ్చినవే. ఓటీటీకి ఎప్పుడు వస్తాయా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నవే.
![](https://img.ap7am.com/froala-uploads/20230823fr64e589ea38ea4.jpg)
ఇక పవన్ - సాయితేజ్ కాంబినేషన్లో సముద్రఖని తెరకెక్కించిన 'బ్రో'కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - మాటలు అందించిన ఈ సినిమా, పవన్ ఫ్యాన్స్ ను హుషారెత్తించింది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ నెల 25 నుంచి తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో 'నెట్ ఫ్లిక్స్' లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలకి ఒక రోజు ముందే, అమెజాన్ ప్రైమ్ లో 'స్లమ్ డాగ్ హస్బెండ్' స్ట్రీమింగ్ కానుంది.
![](https://img.ap7am.com/froala-uploads/20230823fr64e589f752162.jpg)