bus accident: శామీర్ పేట్ లో బస్సు దగ్ధం.. యువకుడి మృతి

Biker spot dead at shameerpet after hitting bus
  • బైక్ ఢీ కొట్టడంతో పెట్రోల్ లీక్ అయి ఎగిసిపడ్డ మంటలు
  • బస్సులోని ప్రయాణికులు సేఫ్.. బైకర్ సజీవదహనం
  • జీనోమ్ వ్యాలీ సమీపంలో మంగళవారం ఉదయం దుర్ఘటన
జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం ఉదయం దగ్ధమైంది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది.. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బైక్ తో పాటు బస్సు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులోని ఉద్యోగులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణించిన ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైక్ పై వెళుతున్నాడు. కొల్తూరు వద్ద బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఢీ కొట్టాడు. దీంతో బైక్ తో సహా కిందపడ్డాడు. అదే సమయంలో పెట్రోల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బైక్, బస్సు రెండూ కాలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న సంపత్ కూడా స్పాట్ లోనే చనిపోయాడు. కాగా, సంపత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు.
bus accident
shamerpet
farma company
Employee death
bus caught fire
Hyderabad

More Telugu News